Sunday, January 22, 2017

Some Telugu Terms

Here are some interesting stories/facts behind some telugu terms -

1) ఆరునొక్క రాగం - ఈ పదం వెనుక వున్న కధ ఈఎ మధ్యనే అమ్మ నాకు చెప్పింది. పూర్వ్ం ధాన్యాని లెక్కెటేటప్పుడు గాడితో కొలుస్తూ ఒకటి, రెండు, ... ఆరు, ఆరున్నొకటి,ఎనిమిది... అలా లెక్కెట్టేవారు. ఏడు వాడే వారు కాదు. అలా వచ్ఛిన అంకెల పద్దతి పిల్లలు ఏడవటం చేస్తే పిల్లాడు ఆరున్నొక్క రాగం అందుకున్నాడు (ఏడుపు కి బదులు)  అనటం వాడుకలొకి వచ్చింది.

2) సింగినాధం జీలకర్ర - దీని వెనుక ఒక పెద్ద కధే వుంది. చందమామ పుస్తకాలలో చిన్నప్పుడు వచ్చినవి. ఈ మధ్య ఫేసు బుక్కు లో పెడితే కాపి చేసాను.

చందమమ వారి కధ "సింగినాధం జీలకర్ర" గురించి -


The above Story and image taken from Chandamama Stories. Not my own.


3) తలకడిగితే మొలకడగరు, మొలకడిగితే తలకడగరు - వారం క్రితం మొదటిసారిగా విన్న వాక్య్ం.దీని గురించి ఫేసు బుక్కు లో ఓ మహానుభావులు అర్ధం వివరిస్తూ పెట్టారు. ఇది గో వారి మాటల్లోనే -

అతిథులకెప్పుడూ వస్త్రాలు జంటగా పెట్టాలి. పంచె-ఉత్తరీయం, చీరా-రవికా... ఇలా. అలాగే తలకు బట్ట (తలపాగా), మొలకు బట్ట (అంగవస్త్రం) కలిపి ఇవ్వాలి. ఇచ్చేవాడికి పద్ధతి తెలియక ఏకవస్త్రం ఇవ్వబోతే కనీసం పుచ్చుకొనేవాడు అడిగి తీసుకోవాలి. కానీ కొందరు అమాయకులు ఏకవస్త్రమిచ్చినా అడగరు. తలకు అడిగితే మొలకు అడగరు, మొలకు అడిగితే తలకు అడగరు.

కానీ కొందరు అవివేకంతో సంధిని పొరపాటుగా విడగొట్టి (తలకు అడిగితే- తల కడిగితే) చేయటం తప్పు. 

--------
The above line and explanation is not my own but as posted by a facebook person. I too made the same mistake of breaking the telugu sandhi at the wrong place. 
నేను కూడా అలా సంధి ని పొరపాటు గా చదివాను. దాని వల్ల అర్ధమే మారిపొతుంది. మీరు కూడా అలా పొరబాటు పడద్దేం సుమా!


No comments:

Post a Comment